Tuesday, February 1, 2011

మహాదేవ

శివ ! శివ ! శంభో మహాదేవ!
నీ  యందు ఎడబాటు ను సర్దుబాటు పేర బద్దకిస్తి ,
నామమైన తలవక ఉత్త పుణ్యాన నే బతుకనేల 
ఎన్నన్ని జన్మలు లెక్కించ నే నిను జేర 
నాలోన శాంతి నిల్పి ఉండిపోవేల జీవితకలమేల్ల !!

ఓ వరం

లోకాన ఉన్న స్వరాలన్నీ  వగలు కోల్పోవా,
 నీ ఏడు వరాల నగలాంటి నవ్వులు జూసి ..?


కార్తీక మేరుపంటి నీ నగవు చూసి 
లంకేశ్వరుడు మళ్ళి  పుట్టునేమో..


పదింటికి లేచేవాన్ని !
నిన్ను పదే పదే చూడాలని 
పొద్దు పొడవక ముందే 
లేచి వేచి ఉన్న..


న మనసు  లోని తహ తహలు  నీ
తలుపు తట్టినట్టున్నాయి 
తట్టినట్టే తిసావ్  తలుపు ..


నువ్వలుకుతున్న వాకిలి నన్ను జూసి వెకిలి నవ్వులు వొలకబోస్తూ ..
"దాగుడు మూతలు కాదు ప్రేమంటే 
 నీ మనసు నీకు దక్కాలంటే 
దసూహం అవ్వాలి ముంగిటే "


ఏమోగాని అద్దినట్టు వేస్తున్న 
తన అందియల చివరలకు 
అంటిన ఎర్రమన్ను కూడా
పారని వలె అందమోలికిస్తుంది...


ముగ్గు వేయటం అయి పోయింది  ..


వెళుతూ వెళుతూ తిరిగి చూస్తూ మురిసిపోతూ..
ఓ చిరు నవ్వు ను సంతకంగా  దాని పై పారేసింది..






కదలికలతో..

కదలికలతో కథలల్లు
                      కను బొమ్మలు ,
అవి కదిలేందుకు కన్తులోలుకు
                                    కళ్ళు,
ఆ కళ్ళకు కలనిచ్చు
                       చక్కిళ్ళు ,
  చక్కిళ్ళు  నడుమ పదాలు సైతం పరవషమోవ్ 
                           పెదాలు ,
ఆ పెదాల మధ్య పదనిసల వలె
                           చక్కిల్లకు  నొక్కుల నవ్వులిచు  ముత్త్యపు వరుసలు ..
ఆహ ఎంతో ప్రేమ తో మమ్ము సృష్టించిన జగద్ప్రభువు వందనం అభివందనం ...